నూలి పురుగుల నివారణ మాత్రలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలి .
ఫోటో రైట్ అప్: భూపాలపట్నంలో నూలి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్న జెడ్పిటిసి చొప్పదండి ,ఆగస్టు 03(జనంసాక్షి): నూలి పురుగుల నివారణ మాత్రలు ఒక సంవత్సరం నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ వేసుకోవాలని జెడ్పిటిసి మాచర్ల సౌజన్య -వినయ్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ లు పేర్కొన్నారు. మండలంలోని భూపాలపట్నం ప్రాథమిక పాఠశాలలో నూలి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి జెడ్పిటిసి సౌజన్య ,చొప్పదండి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి మునిసిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజలు హాజరై విద్యార్థులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు నూలి పురుగుల సమస్య తీవ్రంగా ఉంటుందని ,పిల్లలు తీసుకున్న ఆహారాన్ని వారి శరీరానికి అందకుండా ఇవి నిర్వీర్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని . దీని ద్వారా పిల్లలకు సరైన పోషక విలువలు అందక బలహీనంగా తయారవుతారని, శారీర ఎదుగుదలను ఇవి నిరోదిస్తాయని అందువల్ల వీటి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిల్లలకు తెలిపారు.
పిల్లలకు టీకాలు ,మందులు వేయడం ద్వారా నులి పురుగులను పూర్తిగా నిర్మించవచ్చు అని పేర్కొన్నారు.అన్ని పిహెచ్సి కేంద్రాలలో లభిస్తాయని పిల్లలకు ఈ టీకాలు వేయించాలి అన్నారు. ఈ కార్యక్రమం వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ కిట్టు గౌడ్, పీహెచ్సీ డా రమాదేవి, ఆశ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, స్కూల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు…