నేటి నుంచే నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

గుంటూరు, సాగునీటి ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇరిగేషన్‌ గుంటూరు సర్కిల్‌ కార్యాలయ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌చౌదరి విడుదల చేశారు. ఈ నెల ఏడో తేదీ నుంచి 12వ తేదీ మధ్యన నీటి వినియోగదారుల సంఘాలు(డబ్ల్యూయూఏల) ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదు రోజులకు 18, 19 తేదీల్లో డిసి్ట్రబ్యూటరీ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. చివరగా ఈ నెల 25న కృష్ణా పశ్చిమ డెల్టా, నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుపుతారు. తద్వారా ఎన్నికల ప్రక్రియని పూర్తి చేస్తారు. 2013లో సాగునీటి సంఘాల పదవీకాలం ముగిసిపోగా అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికలు జరపలేదు. దీంతె ఎన్నో సమస్యలు తలెత్తుతూ వస్తోన్నాయి. ముఖ్యంగా పంట కాలువలు, డ్రెయిన్లు, చెరువులకు సంబంధించి ఏటా వేసవికాలంలో నిర్వహించే కనీస పునరావాస మరమ్మతులను సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో శనివారం సాయంత్రానికి అధికారులు కసరత్తు జరిపి ఎన్నికల షెడ్యూల్స్‌ని రూపొందించారు. జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో 129, ప్రకాశం జిల్లా పరిధిలో 17 నీటి వినియోగదారుల సంఘాలున్నాయి. గుంటూరులో 18, ప్రకాశంలో 2 డిసి్ట్రబ్యూటరీ కమిటీలున్నాయి. గుంటూరు ఛానల్‌ పరిఽధిలో 14 నీటి వినియోగదారుల సంఘాలు, రెండు డిసి్ట్రబ్యూటరీ కమిటీలున్నాయి. డిసి్ట్రబ్యూటరీ కమిటీలకు ఎన్నికైన అధ్యక్షులందరూ కలిసి కేడబ్ల్యూ ప్రాజెక్టు కమిటీని ఎన్నుకొంటారు. చిన్ననీటిపారుదల శాఖకు సంబంధించి కేడబ్ల్యూ పరిధిలో 60 నీటి వినియోగదారుల సంఘాలు, ఎన్‌ఎస్‌పీలో 220 డబ్ల్యూయూఏలున్నాయి. నాగార్జునసాగర్‌ కుడికాలువ పరిధిలో 259 డబ్ల్యూయూఏలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయి

తాజావార్తలు