నేటి బ్లక్‌డేలో పాల్గొని నిరసన తెలపండి
ప్రజలకు రఘువీరా పిలుపు
విజయవాడ,నవంబర్7(జనంసాక్షి): పెద్దనోట్ల రద్దుతో ప్రజల్ని కష్టాలపాలు చేసిన ప్రధాని మోడీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 8న చేపట్టిన బ్లాక్ డే కు ప్రజలంతా మద్దతు పలకాలని పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి కోరారు. ఏడాదిగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలయచేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్త యినా ఏవిూ సాధించకపోగా, దేశ ప్రజల్ని ఇబ్బందులపాలు చేశారన్నారు. విపక్షాలు, కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకుఎపిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. గతేడాది నవంబర్ 8న దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. టెర్రరిజాన్ని, నల్లధనాన్ని అరికట్టి, నకిలీ కరెన్సీ లేకుండా చేస్తామని ఏకపక్షంగా నోట్ల రద్దును ప్రకటించారన్నారు. అయితే ఈ లక్ష్యాల్లో దేనినీ సాధించలేకపోయారన్నారు. నల్ల ధనం బ్యాంకులకు చేరి తెల్లధనంగా మారిందే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. నోట్ల రద్దుతో దేశంలోని అసంఘటిత రంగంలోని పేదలు పెద్ద ఎత్తున జీవనోపాధి కోల్పోయారన్నారు. వీటన్నింటిపై ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమను పూర్తిగా విస్మరించిందన్న అభిప్రాయం బడుగు, బలహీనవర్గాల్లో బలంగా వినిపిస్తోందన్నారు. అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, తదితర అంశాలు అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయని ఆయన చెప్పారు దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఇందిరా గాంధీ పుణ్యమేనని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఇకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం, వైకాపాలు బలహీనవర్గాల వ్యతిరేక పార్టీలని రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరుకు కొంతమంది బీసీ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి అధికారాన్ని మాత్రం ఆయన, కుమారుడు లోకేష్‌లు చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారికి ఒక ¬దా కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.