నేడు చెరుకు రైతుల దీక్ష వాయిదా వేస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు
జహీరాబాద్ జులై 18 (జనం సాక్షి) చక్కర పరిశ్రమను ప్రభుత్వం ఆదినం లోకి తీసుకొని గానుగ ప్రారంభించాలని తద్వారా చెరుకు రైతులు ఆదుకోవాలని ఈరోజు తలపెట్టిన చెరుకు రైతుల మహాదీక్షను అకాల వర్షం కారణంగా రైతుల అభిప్రాయం మేరకు రైతు సంఘాల నాయకులు వివిధ పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు ఈరోజు జరగవలసినటువంటి మహా దీక్షను కొద్ది రోజులపాటు వాయిదా వేస్తున్నాము అతి త్వరలోనే ఏ కార్యక్రమం చేస్తాము అన్న అంశంపై అందరి నాయకుల తో కలిసి ఏం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలోనే ప్రకటిస్తామని మొగుడంపల్లి ఆశప్ప ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈరోజు వాయిదా వేస్తున్న సమావేశంలో కొత్తూరు నరసింహారెడ్డి గారు, రైతు సంఘం నాయకులు కొండల్ రెడ్డి గారు, అడ్వకేట్ గోపాల్ గారు, బీఎస్పీ నాయకులు సిద్ధూ రావణ్ వైయస్సార్సీపి నాయకులు జోన నరేష్, రైతు నాయకులు రాజు రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీమ్, విద్యార్థి నాయకులు సురేష్, ఆనంద్ ఈశ్వర్, పరిశ్రమ కార్మికులు జగదీష్, జయరాజ్, తదితరులు పాల్గొనడం జరిగింది