నేడు జన్మభూమిలో మెగా రుణమేళా

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి,జనవరి9(జ‌నంసాక్షి ): బుధవారం నిర్వహించే మెగా రుణమేళా, బ్యాంకు లింకేజి కార్యక్రమాలను విజయవంతం చేయాలాని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మెగా రుణమేళా, బ్యాంకు లింకేజీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, బ్యాంకర్లే జన్మభూమి సభలకు వచ్చి రుణమేళా నిర్వహించడం, బ్యాంకు లింకేజీలు ఇవ్వడం ఇదే తొలిసారి అని సీఎం పేర్కొన్నారు. బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరిగే అవసరం లేదని తేల్చిచెప్పారు. బ్యాంకర్లే జన్మభూమి సభలకు వచ్చి రుణమేళా నిర్వహించడం, బ్యాంకు లింకేజిలు ఇవ్వడం ఇదే తొలిసారిగా అభివర్ణించారు. జన్మభూమి-మా వూరు’ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు,నోడల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి గ్రామానికి, వార్డుకు డెవపల్‌మెంట్‌ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలన్న సీఎం… అందుకు 16వేల విద్యార్ధి బృందాల సేవలు వినియోగించుకోవాలన్నారు. తెలివి తేటలకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ప్రకృతిని కాపాడుకోవడానికి, పేదరికం నిర్మూలనలకు, సంపద సృష్టికి శాస్త్ర సాంకేతికత దోహదపడుతోందని తెలిపారు. ప్రతి రైతు ఏడాదికి 3లక్షల నుంచి 4లక్షలు సంపాదించే స్థితి రావాలని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ రతనాల సీమగా మారే రోజు దగ్గర్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇది స్ఫూర్తిదాయక సమయం.. చైతన్యపరిచే కార్యక్రమం.. ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి గ్రామానికి, వార్డుకు డెవలప్‌మెంట్‌ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని, 16వేల విద్యార్ధి బృందాల సేవలు వినియోగించుకోవాలని అధికారులను కోరారు. అలాగే మన తెలివితేటలకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని, ఒకవైపు డిజిటల్‌

లిటరసీని ప్రోత్సహిస్తూ.. మరోవైపు ్గ/బైర్‌ గ్రిడ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ-ప్రగతి, రియల్‌ టైం గవర్నెన్స్‌, పరిష్కార వేదిక 1100, పరిపాలనలో టెక్నాలజి వినియోగానికి తార్కాణాలన్నారు. అంతేగాక చిత్తూరు జిల్లా హార్టికల్చర్‌, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, అనంతపురం జిల్లా ఇండస్టీయ్రల్‌ హబ్‌గా మారుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులను కలిపి మహా సంగమం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజావార్తలు