నేడు వైకాపాలోకి వసంత కృష్ణప్రసాద్‌

టిడిపిలో గుర్తింపు లేకపోవడంతో నిర్ణయం
విజయవాడ,మే9(జ‌నం సాక్షి): సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ గురువారం జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరనున్నారు. గతంలో వసంత నాగేశ్ర రావు వివిధ ¬దాల్లో పనిచేశారు. ఆయన తనయుడిగా కృష్ణ ప్రసాద్‌కు మంచి పేరుంది. టిడిపిలో ఉన్నా పెద్దగా గుర్తింపు లేకపోవడంతో వైకాపాలో చేరాలనుకున్నారు.  గురువారం ఉదయం కైకలూరు నియోజకవర్గంలో పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టుగా కృష్ణ ప్రసాద్‌ ప్రకటించారు. నందిగామ మండలం ఐతవరంలోని వసంత స్వగృహం నుంచి భారీ ర్యాలీతో కైకలూరు వెళ్లేందుకు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు.   1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారు. గుంటూరు-2 స్థానం నుంచి కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించాలని టీడీపీ యోచించింది. రాజకీయ సవిూకరణాలతో చివరి నిమిషంలో టికెట్‌ లభించలేదు. ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ‘తంగిరాల’ గెలుపునకు కృషి చేశారు. తంగిరాల ప్రభాకరరావు మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఆయన్ను దూరంగా ఉంచారు.   పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు. తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో కృష్ణప్రసాద్‌ను జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వ్యాపారరీత్యా వైఎస్‌ కుటుంబంతో కృష్ణప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు టికెట్‌కు ఖరారైందన్నట్టుగా అనుచరులు చెపుతున్నారు. మైలవరం నుంచి శాసనసభకు లేకపోతే విజయవాడ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారంటున్నారు.
——

తాజావార్తలు