నేడే టీయుడబ్లూజే ఐజేయు ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం
గద్వాల నడిగడ్డ, జులై 28 (జనం సాక్షి);
టియుడబ్లూజే(ఐజేయు)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్,ప్రధాన కార్యదర్శి విరహత్ ఆలీ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఉచిత వైద్య సదుపాయం హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ టీయుడబ్లూజే ఐజేయు జోగుళాంబ గద్వాల జిల్లా శాఖ అధ్యక్షుడు పి. రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డు ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందనీ,గద్వాల పట్టణంలోని ప్రధాన పోస్టు ఆఫీస్ వద్ద జర్నలిస్టులు పోస్ట్ ఆఫీస్ లో కార్డులను పోస్ట్ చేసి తమ నిరసన చేపట్టడం జరుగుతుందనీ, జిల్లాలోని జర్నలిస్టులందరూ ఈ పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్నవలసిందిగా,నేడు శనివారము ఉదయం 10 గంటలకు గద్వాల పట్టణంలోని ప్రధాన పోస్టు ఆఫీస్ వద్ద ఎస్ బీఐ బ్యాంక్ పక్కన- కొత్తబస్టాండ్ ఎదురుగా జిల్లాలోనీ జర్నలిస్టు మిత్రులు ఎక్కువ మొత్తంలో పాల్గొని పోస్ట్ కార్డు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు.