నేతన్న సంక్షేమానికి పెద్దపీట

చొప్పదండి, ఆగస్టు 11 (జనం సాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం చొప్పదండి పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జాతీయ చేనేత వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవని అన్నారు. గతంలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో నేతన్నలు, భార్యాబిడ్డలను సాదుకునే స్థాయి లేక పిల్లలను చదివించడానికి చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో సిరిసిల్ల గోడల మీద చేనేత బతుకులు మారవా సిరిసిల్ల కాదు ఉరిసిల్ల అని రాశారని అన్నారు. గోడలపై రాసిన రాతలను కేసీఆర్ చూసి తెలంగాణలో నేతన్నల బతుకులు మారాలంటే తెలంగాణ వస్తేనే జీవితాలు మారుతాయని ఆలోచించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల కోసం అనేక సంస్కరణలు సీఎం కేసీఆర్ చేశారని తెలిపారు. బతుకమ్మ చీరలు, స్కూలు యూనిఫార్మ్స్, టవల్స్, టెక్స్ టైల్స్ పార్కు, కరెంటులో 50 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తు వారిని అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతన్న చనిపోతే రూ. ఐదు లక్షల ప్రమాద బీమా ఎలా ఇస్తుందో నేతన్న చనిపోతే రూ. ఐదు లక్షలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నేతన్నలకు 50 సంవత్సరాలకే 2వేల ఫించన్ ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. నియోజకవర్గం లో నూతన కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేసి నిర్మించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్స్ ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దుచేసి ఎత్తివేయాలని చూస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వాలలో బీమా సౌకర్యాలు రూ. 20 వేల నుండి 60 వేలు ఉండేవని అవి కూడా ఎత్తివేశారని రైతన్నలకు, నేతన్నలకు వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధాని, అంబానీలకు కొమ్ముకాస్తూ
పేదోళ్ల కడుపు కొట్టి పెద్దలకు పంచే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని విమర్శించారు. 65 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఏమి చేయలేదని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అందరూ ప్రజలు బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. చొప్పదండి నియోజకవర్గం కేంద్రాన్ని గతంలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని పట్టణ అభివృద్ధికి రూ. 120 కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తున్నాని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ను గతంలో ఎవరు పట్టించుకోక అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రభుత్వంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణ హరి, వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు, తహసిల్దార్ నరేందర్, చేనేత సంఘం అధ్యక్షుడు దండ రాజయ్య, కౌన్సిలర్లు మాధురి శ్రీనివాస్ కొట్టే అశోక్, మండల కో ఆప్షన్ పాష, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బండారం అజయ్, ఎన్నం మునిందర్, మహేశుని మల్లేశం కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు