పంచాయతీ కార్మికును విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు : ఐ ఎఫ్ టియు శివబాబు
తెలంగాణ గ్రామ పంచాయతి కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని, పంచాయతీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటమాడుతుందని ఆరోపించారు. వర్షాన్ని సైతం లెక్కపెట్టకుండా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలపాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేసి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా శ్రమను దోచుకుంటుందన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సఫాయి కార్మికునికి సలాం అంటున్నాడే తప్ప సఫాయి అన్నకు జీతాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఐ ఎఫ్ టి యు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మిక నాయకులు సుధాకర్, శ్రీకాంత్, ముత్యాలు, సుగుణ, లక్ష్మి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.