పంచాయతీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి

టేకులపల్లి, జూలై 11 (జనం సాక్షి): గ్రామపంచాయతీ కార్మికులు ఉద్యోగులు గత ఆరు రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సమ్మెను విచ్చిన్నం చేయడానికి అనేక కుట్రలు,కుతంత్రాలు జరుగుతున్నాయి. ఉద్యమాలు బలహీన పరచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులు వస్తున్నాయి. అయినప్పటికిని కార్మికులు, ఉద్యోగులు వెన్నుచూపకుండా మడమ తిప్పకుండా అత్యంత మానవతతో కూడిన తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెను దృఢంగా కొనసాగిస్తున్నారు. ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మిక ఉద్యోగులపై ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం సమంజసం కాదన్నారు. ఈ వైఖరిని సిపిఐ( ఎంఎల్) న్యూడేమెక్రసి ఇల్లందు సబ్ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ,నిరాదరణ వైఖరిని ఖండించాలని ప్రజలకు ప్రజాస్వామీకు వాదులకు మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే ఈ కార్మికులకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తూ సమ్మెకు నాయకత్వం వహిస్తున్న జెసి నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు బానోతు ఊక్లా, నోముల భానుచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగులు తమ సమ్మెను మరింత దృఢంగా ఐక్యంగా కొనసాగించాలని వారు సాగిస్తున్న ఉద్యమానికి న్యూడేమెక్రసి పార్టీ మద్దతుగా నిలుస్తుంది అన్నారు.

తాజావార్తలు