పంచాయితీ కార్మికుల సమ్మె కు మద్దతు గా జనసేన

భైంసా రూరల్ జనం సాక్షి జూలై31

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితి కార్మికులు గత 26 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం దీన్ని జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వారు మాట్లాడుతూ
స్వతంత్రం వచ్చినప్పటి నుండి పంచాయితీ వ్యవస్థ వుంది.కాని బంగారు తెలంగాణలో మాత్రం జీతాల కోసం సమ్మె లు చేయాల్సిన పరిస్థితి దాపురించింది అని వారు కొనియాడారు.
ఇన్ని రోజులు నుండి సమ్మె పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసం.
ఎమ్మెల్యే,మంత్రులకు జీతాలు పెంచుకున్నారు కాని ప్రతి రోజు మురికిలో మురికి అయి అనారోగ్య పాలై కుటుంబ భారాన్ని మోయలేక చచ్చి పోతున్న కార్మికుడి జీతం పెంచలేని ఈ ప్రభుత్వం వున్న ఒకటే లేకున్న ఒకటే.
పచ్చదనం పరిశుభ్రత కు మారుపేరు ఈ పంచాయితీ కార్మికులు అలాంటి వారిని పట్టించుకోక పోతే మీ పదవులు ఎందుకు అని వారు ప్రశ్నించారు.
తెలంగాణ వస్తె మా బతుకులు మారుతాయి మా బిడ్డల భవిష్యత్ బాగుంటది అని నమ్మి చెత్తలో పని చేస్తున్న మాపై ఇంత నిర్లక్షం ఎందుకు ? అసలు ఈ పనిలో పేద మధ్య తరగతి దళిత బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వేరే ఎక్కువ మంది వున్నారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కనీసం ఇప్పటి వరకు విరి సమస్య ఏంటిది అని అడిగే నాథుడే లేడు.
సమ్మె వల్ల గ్రామాల్లో చెత్త పేరుకుపోయింది అసలే వర్ష కాలం ప్రజలకు చాలా ఇబ్బంది కలిగి రోగాన బారిన పడితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.కాబట్టి ప్రభుత్వం వెంటనే కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని,పర్మినెంట్ చేయాలని,ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,అర్హులైన వారిని కారోబార్,బిల్ కలెక్టర్ గా నియమించాలని,డిమాండ్ చేస్తున్నాం.లేని యెడల అదే చెత్తతో ప్రజా ప్రతినిధుల ఇండ్ల లో పోసి నిరసన తెలియచేయడానికి సిద్దంగా వున్నాం అని వారు హెచ్చరించారు.

తాజావార్తలు