పంటరుణాల లక్ష్యం చేరుకోవాలి: సిఎస్‌

అమరావతి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి):పంటరుణాల పంపిణీ లక్ష్యాలను వెంటనే చేరుకోవాలని ఎపి సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలురైతులకు రూ.1,300కోట్ల పంటరుణాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్రలో పంటరుణాల పంపిణీపై బ్యాంకర్లు మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటనష్టం అంచనాలను తయారుచేయాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్‌ పూర్తిచేసి సకాలంలో నివేదికలు కేంద్రానికి పంపాలని సీఎస్‌ తెలిపారు.

నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ రైతు సదస్సుకు ఏర్పాట్లు చేయాలని అలాగే ఇండస్టియ్రల్‌ సమ్మిట్స్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. లేబర్‌ కాంపోనెంట్‌ నిధుల వినియోగంలో ప్రతిజిల్లా ముందుండాలని అన్నారు. నరేగా నిధులు రూ.337కోట్లు ఆయా ఖాతాలలో వేసినట్లు చెప్పారు.

ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందజేయాలని అలాగే అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నరేగా, హౌసింగ్‌ అధికారులు సమన్వయంగా పనిచేయాలని సీఎస్‌ సూచనలు చేశారు.

 

తాజావార్తలు