పట్టిసీమపై జగన్‌ విషం చిమ్ముతున్నారు- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

– వచ్చే సంక్రాంతి నాటికి మచిలీపట్నం పోర్టులో తొలినౌకను చూస్తాం
– కర్ణాటకలో బీజేపీకి గెలుపుకు విజయసాయి కృషిచేస్తున్నాడు
– అక్కడ డబ్బులు పంచొచ్చి.. ఇక్కడ నల్ల కండువా కప్పుకుంటున్నాడు
– ప్రత్యేక ¬దాపై జగన్‌ మోదీని ప్రశ్నిస్తున్నాడా?
– చంద్రబాబును విమర్శించటమే వైసీపీ పనిగా పెట్టుకుంది
– రాష్ట్ర ప్రయోజనాలే తెదేపాకు ముఖ్యం
– విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమా
అమరావతి, మే2( జ‌నం సాక్షి) : పట్టిసీమ నీటితో రైతులు పంటలు పండించి సంతోషంగా ఉంటే నీళ్లు రాలేదంటూ విపక్షనేత జగన్‌ విషం చిమ్ముతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందకోట్లు తీసుకుని మచిలీపట్నం పోర్టును గిలకలదిండి – గోగిలేరుకు తరలించేశారని మంత్రి ఆరోపించారు. మళ్లీ పోరాడి పోర్టును తెచ్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. పనులు పరుగులు పెట్టించి వచ్చే ఏడాది సంక్రాంతినాటికి మచిలీపట్నం ప్రజలు పోర్టులో తొలి నౌకను చూసేలా చేస్తామని వెల్లడించారు. ప్రతీ శుక్రవారం కమలదళం నీళ్లు చల్లుకునే జగన్‌ కోర్టుకు హాజరవుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైకాపా నేత విజయసాయి రెడ్డి బెంగళూరులో భాజపా కండువా కప్పుకుని విశాఖ వచ్చి నల్లకండువా వేసుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ నుంచి సీబీఐ జప్తు చేసిన ఆస్తులను విక్రయిస్తే రాష్ట్ర ప్రజలందరికీ కార్లు, కేజీ బంగారం కొనిపెట్టొచ్చని అన్నారు. ప్రతిపక్షనేతగా ఒక్కసారైనా జగన్‌ రాష్ట్ర ప్రాజెక్టుల గురించి.. ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడారా? అని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. కర్ణాటకలో గాలి జనార్థన్‌ రెడ్డి అనుచరులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, విజయసాయిరెడ్డి, కడప నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు దీక్షలు చేస్తుంటే విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిశారని ఆరోపించారు. ప్రత్యేక ¬దా అంశంపై కేంద్రాన్ని నిలదీయకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారంటూ జగన్‌ తీరుపై దేవినేని మండిపడ్డారు. తన అనుచరులతో బూతులు తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. అనంతరంన్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే జగన్‌ అవాకులు చెవాకులు పేలుతున్నారని  విమర్శించారు. గిలకలదిండి- గోగిలేరుకు పోర్టును వైఎస్‌ అమ్మేస్తే.. పోరాడి మచిలీపట్నానికి మళ్లీ తెచ్చుకున్నామని
అన్నారు. పోర్టు 4,800 ఎకరాల్లో మాత్రమే నిర్మితం అవుతుందని అన్నారు. పూర్తిగా రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామని చెప్పారు. వచ్చే జనవరి నాటికి మచిలీపట్నం పోర్టులో నౌకలు తిరుగుతాయని మంత్రి కొల్లు తెలిపారు.

తాజావార్తలు