పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు – చేనేత కార్మికులకు సన్మానం – పదిలో ప్రతిభలకు ప్రశంస పత్రాలు, తల్లితండ్రులకు సన్మానం


జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలోని పద్మశాలి భవనంలో మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షకార్యదర్శులు కుందారపు బాపు, మేరుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల రామ్మూర్తి, సింగరేణి అధికారి అదనపు మేనేజరు ( ఓసి1 రక్షణాధికారి) అందె కోటయ్య తో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదిగా సన్మానాలు చేశారు.
మొదట కులదైవం మార్కండేయ పటానికి పూలమాల అలంకరించి ప్రారంభించి ఈ వేడుకలలో చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ రొంపికుంటకు చెందిన చేనేత పద్మశాలియులు కుందారపు చంద్రయ్య, కుందారపు శంకరయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించినారు.
ఈ శుభసందర్భంగా 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో 10 నుండి 9.5 జిపిఏ లతో అత్యుత్తమ ప్రతిభ సాధించిన ఐదుగురు మండలంలోని పద్మశాలి విద్యార్థులు రొంపికుంటకు చెందిన బొట్ల రమ్యశ్రీ (10/10), శాలపల్లికి చెందిన మచ్చ కావేరి(9.8) తాటికొండ అక్షయ(9.8), సామల మహేష్(9.5), మాటేటి మారుతి(9.5) వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేయడం జరిగినది. వీరిలో చిన్నతనంలో తండ్రినికోల్పోయి, కడుపేదరికంలో పెరిగినను 10/10 జిపిఏ సాధించిన కుమారి బొట్ల రమ్మశ్రీకి పై చదువుల నిమిత్తము జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగి కొలిపాక సత్తయ్యగారు రూ 5,000/- లను, రొంపికుంట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూ 1000/- ఆర్థిక సహాయం అందించారు. మండలానికి చెందిన ఏకైక పత్రిక విలేఖరి మాటేటి కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ నెల 13న జరుపబోయే చలో కోరుట్ల పోస్టరును ఆవీష్కరించి, సభకు మండలంలోని అందరు పద్మశాలీలు కుటుంబంతో హాజరై విజయవంతం చేసి పద్మశాలీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
వక్తలు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలకంటే ఘనంగా అన్ని కార్యక్రమాలతో పాటు గత ఉగాదినాడు నిర్వహించిన పలురంగాలలో రాణిస్తున్న మండల పద్మశాలిలకు ప్రతిభ పురస్కాలను గుర్తుచేస్తూ ప్రతి యేడు ఆనవాయితిగా నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన పద్మశాలిలకు ప్రతిభను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించడం, సంఘాల ద్వారా ఐక్యత చాటడం చాలా సంతోషాన్నిస్తుందని అన్నారు.అనంతరం నిర్వాహకులు అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా నాయకులు గుండేటి రాజేష్, అందె సదానందం, బూర్ల ధనుంజయ, పర్ష రమేష్, కూచన మల్లయ్య మహర్షి, బండారు సదానందం, సిద్దిపల్లె సర్పంచ్ తాటికొండ శంకర్, అడిచెర్ల స్వతంత్ర కుమార్, గుండేటి శ్రీమూర్తి, పడాల సరోజ-మల్లేష్, కొండి శంకర్, కుందారపు శంకరయ్య, కుందారపు శేఖర్, కొండి అనిల్, వేముల కనకయ్య, పడాల అజిత్, కొండి సాయి, కొండి నారాయణ, కొండి సంపత్, బొట్ల నరేష్, బంక పురుషోత్తం, దాసరి లింగయ్య, ఆడెపు రమేష్, బండి రాజయ్య, మాటేటి వెంకటేశం, బంగారి గట్టయ్య, కుందారపు సది, కుందారపు శ్రవణ్, కుందారపు శ్రీనివాస్, కుందారపు అనిల్, బిల్ల కృష్ణ, తాటికొండ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు