పనిచేసే వారికే నామినేటెడ్‌ పదవులు

కొందరి పనితీరుపై బాబు అసంతృప్తి
టిడిపి సమన్వయ కమిటీ భేటీలో ప్రత్యేక చర్చ
అమరావతి,నవంబర్‌1(జ‌నంసాక్షి): టిడిపిలో పనిచేసే వారికే పదవులు అని పార్టీ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఇంటింటికీ తెలుగుదేశంలో సి, డి గ్రేడ్లల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు బాబు క్లాస్‌ తీసుకున్నారు. మహానుభావుల పనితీరు ఇదేనా అంటూ వారిపై వ్యాఖ్యలు చేశారు. బుధవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో  చంద్రబాబు కొందరు నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సి, డి గ్రేడ్లల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తెలుగుదేశం పైనా చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న తీరును జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయనకు వివరించారు. ఇప్పటికీ నలభై నియోజకవర్గాలు సీ, డీ గ్రేడుల్లోనే ఉన్నాయని లోకేష్‌ తెలిపారు. మున్సిపల్‌ శాఖకు సంబంధించే అత్యధిక ఫిర్యాదులందాయని పేర్కొన్నారు. కమిటీ భేటీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది. పని చేసే వారికే పదవుల భర్తీలో ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేవారు.  మచిలీపట్టణం పార్లమెంట్‌ పరిధిలోని పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సి-గ్రేడ్‌ లో ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ గాడిలో పెట్టాలని ఇంచార్జి మంత్రి యనమలకు బాబు సూచన చేశారు. టీడీపీ సమన్వయ కమిటీలో ఇంటింటికి టీడీపీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ మొత్తం 85లక్షల కుటుంబాలను కలిశామని కమిటీకి తెలిపారు. మున్సిపల్‌ శాఖకు సంబంధించే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పటికీ 40 నియోజకవర్గాలు సీ, డీ గ్రేడుల్లోనే ఉన్నాయని చెప్పారు. సీ, డీ గ్రేడుల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలపై బాబు అసంతృప్తిగా ఉన్నారని ఆయన వివరించారు. సమన్వయ కమిటీ భేటీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పని చేసే వారికే పదవులను భర్తీ చేయడంలో ప్రాధాన్యముంటుందిని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పొలిటికల్‌ వర్క్‌ చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

తాజావార్తలు