పాకిస్తాన్‌ల్లో నల్లధనం – బాబు

విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ  రెండు వేల రూపాయల నోట్లు రావని, వచ్చినా తక్కువ సంఖ్యలో రావచ్చన్నారు. దీనిపై మరింత వివరణ రావాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో రెండు వందల నోటు ఉంimagesటుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చు కానీ రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. మొదటి నుంచి పెద్దనోట్ల రద్దుకే పోరాడుతున్నానని, కేంద్రం నిర్ణయాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇప్పటికే సింగపూర్, కెనడా, యూరోప్‌లోని పలు దేశాల్లో పెద్ద కరెన్సీని రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. తద్వారా ఆయా దేశాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల్లో నల్లధనం విపరీతంగా ఉందని, ఈ విధానాన్ని ప్రపంచం అంతటా అమలు చేస్తే మేలన్నారు.

తాజావార్తలు