పాక్ సుప్రీం కోర్టు ఎదుట హాజరైన ప్రధాని అష్రాఫ్
ఇస్లామాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో పాక్ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ ఆ దేశ సుప్రీం కోర్టు ఎదుట ఈ ఉదయం హాజరయ్యారు. అధ్యక్షుడు జర్దారీ మనీలాండరింగ్ కేసుల పునర్విచారణకు సంబంధించి స్విస్ అధారిటీస్‌కు లేఖ రాయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు ప్రధానికి ఈ నెల 8న కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రధాని ఈ రోజు కోర్టు ఎదుట హాజరై జర్దారీ కేసులో స్విస్ అథారి టీస్‌కు లేఖ రాసేందుకు నాలుగు నుంచి ఆరు వారాల గడువు కావాలని కోర్టును అభ్యర్ధించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ సంబంధమైన అంశాలను అర్థం చేసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని కోరారు.