పాడి పశువుల యాజమాన్యం పై శిక్షణ కార్యక్రమం
హైదరాబాదు (జనం సాక్షి ):
ఈరోజు పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం లో పాడి పశువుల యాజమాన్యం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ సాయికిరణ్, పశు వైద్య శాస్త్రవేత్త మాట్లాడుతూ పాడి పశువుల పెంపకంలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా దూడల పోషణ, జున్నుపాల యొక్క ప్రాముఖ్యత, పాడి పశువుల యొక్క గృహవసతి మరియు పునరుత్పత్తి యాజమాన్యం గురించి తెలియజేయడం జరిగింది. అప్పుడే పుట్టిన దూడలకు మొదటి అరగంటలో జున్ను పాలు తాగించవలసిందిగా సూచించారు. తద్వారా దూడలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. డాక్టర్ శశాంక్ పశు వైద్య శాస్త్రవేత్త మాట్లాడుతూ
దూడల్లో మరియు పాడి పశువులలో డీవార్మింగ్ మరియు టీకాల షెడ్యూల్ అంతేకాకుండా సీజనల్ వ్యాధులను నివారించడానికి అనుసరించాల్సిన నివారణ మరియు నియంత్రణ ప్రోటోకాల్‌ల గురించి వివరించారు. ఆ తర్వాత వచ్చిన రైతులకు పెద్ద విశ్వవిద్యాలయం తయారు చేసిన ఖనిజ లవణ మిశ్రమ పాకెట్లను ను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య, డాక్టర్ రాజు మరియు డాక్టర్ గణేష్ రైతులు పాల్గొన్నారు.