పాదయాత్రలో కాళ్లకు బొబ్బలు

అయినా ఆపేది లేదన్న రోజా

తిరుపతి,నవంబర్‌30(జ‌నంసాక్షి): గాలేరు- నగరి ప్రాజెక్టు సాధనకై రోజా పాదయాత్ర ప్రారంభించిన రెండు రోజులకే కాల్లు బొబ్బకట్టి ఇబ్బంది పడ్డారు. పాదయాత్ర ప్రారంభించి గురువారానికి రెండు రోజులు పూర్తయింది. అయితే పాదయాత్రలో ఆమె రెండు కాళ్లకు బొబ్బలు వచ్చాయి. గరి వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. అయితే కాళ్లకు చెప్పులు లేకుండా పాదయత్ర సాగిస్తుండటంతో బొబ్బలు వచ్చాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే రోజా మాత్రం బొబ్బలెక్కినా మొక్కవోని దీక్షతో యాత్ర సాగిస్తానని చెప్పుకొచ్చారు. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రోజాకు సూచించినట్లుగా తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా మొదటి రోజు విూడియాతో మాట్లాడిన రోజా.. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కనీసం సొంత జిల్లాకైనా తాగునీరు, సాగునీరు ఇవ్వలేకపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా పాదయాత్రకు చిత్తూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలంతో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు.

తాజావార్తలు