పాపికొండలకు బోట్లనిలిపివేత
రాజమండ్రి,నవంబర్16(జనంసాక్షి): పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను అధికారులు నిలిపివేశారు. అలాగే రెండు బోట్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో గత రెండు రోజుల క్రితం బోటు బోల్తా పడి 20 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధ, గురువారాల్లో పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను తనిఖీ చేస్తున్నారు. గురువారం విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు. అందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారు.
పాపికొండలు విహారయాత్రకు అధికారులు బ్రేక్ వేశారు. యాత్రకు వెళ్లే పలు బోట్లను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా మరో రెండు బోట్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో మూడు రోజుల క్రితం బోటు బోల్తా పడి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను తనిఖీ చేసి పలు బోట్లను నిలిపివేశారు. అందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారు.