పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి

పాపికొండలు  విహారయాత్రకు  వెళ్తున్న ప్రయాణికులకు…పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి  పెను ప్రమాదం తప్పింది.  120 మంది  పర్యాటకులతో  వెళ్తున్న  బోటులో…. షార్ట్ సర్క్యూట్ తో  మంటలు చెలరేగాయి.  ప్రమాదాన్ని ముందే  గుర్తించిన  టూరిస్టులు.. బోటు దిగేశారు.  సిబ్బంది  సకాలంలో గుర్తించడం.. గజ  ఈతగాళ్లు  తొందరగా స్పందించడంతో  ప్రాణనష్టం తప్పింది.  బోట్  కాలిపోవడంతో… పర్యాటకులంతా  మరో బోటులో పాపికొండలకు  బయల్దేరారు. తూర్పుగోదావరి జిల్లా  దేవీపట్నం  మండలం …వీరవరపు లంక  దగ్గర  ప్రమాదం జరిగింది.

గోదావరిలో నది మధ్యలో బోటుకి మంటలు రావటంతో ఒక్కసారి భయానక వాతావరణం నెలకొంది. ఎవరికి వారు యాత్రికులు కాపాడుకునే ప్రయత్నంలో గందరగోళం నెలకొంది. అయితే ఒడ్డుకి దగ్గరలోనే ఉండటం.. దీనికితోడు నది లోతుగా లేకపోవటంతో నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకున్నారు. బోటుకి మంటలు ప్రారంభం అయిన వెంటనే కొంత మంది యాత్రికులు.. వెంటనే పోలీసులు, స్థానికంగా ఉన్న బంధువులకు ఫోన్లు చేశారు. వాట్సాప్, ఫోన్ల ద్వారా ఈ సమాచారం నిమిషాల్లోనే అందరికీ చేరిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. గత ఈతగాళ్లను స్పాట్ కు పంపించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. బోటులోని 120 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యాత్రికులు అందరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత మంటలు బోటు అంతా వ్యాపించాయి. కళ్ల ముందే మొత్తం బూడిదగా మారింది.

తాజావార్తలు