పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి

 

గుంటూరు,జ‌నం సాక్షి ): గ్రామ పంచాయతీల్లో అనేక ఏళ్ల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయటం, మలినాలు తొలగించటం, మంచినీటి సరఫరా, వీధి దీపాల రిపేర్లు తదితర విభాల్లో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న వర్కర్లను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.పుల్లారావు అన్నారు. ఏనాటికైనా తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ అవుతాయని ఆశగా ఉన్న వారికి ప్రతి ఏటా నిరాశే ఎదురవుతుందన్నారు. మేడే రోజు ఘనంగా ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులు కార్మికులను మాత్రంపట్టించు చుకోవడం లేదన్నారు. పాలకపార్టీలు ఎన్నికల్లో రెగ్యులరైజ్‌ చేస్తామని వాగ్థానం చేసి ఎన్నికల తర్వాత హావిూలు గాలికొదిలేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని,

కానీ వర్కర్ల వేతనాలు మాత్రం పెరగట్లేదన్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పంచాయతీ కార్మికులకు అభద్రత లేకుండా చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల కలెక్టర్లు, డిపిఓలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకూ ఆవి ఆచరణ రూపం దాల్చలేదన్నారు. జిల్లాలో బకాయి వేతనాలు ఒకేసారి ఇవ్వట్లేదన్నారు. కార్మికుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనియోడల పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.

 

తాజావార్తలు