పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి నెలకు 19,000 వేతనం ఇవ్వాలి – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ హుజూర్ నగర్

జులై 11 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నిరవధిక సమ్మెలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపి, వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 19 వేల రూపాయల వేతనం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రాధాన్యతను గుర్తించి వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చి వారికి రావలసిన అలవెన్స్ లను అందజేయాలన్నారు. వారి డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మె కొనసాగితే గ్రామాలు మురికి కూపాలుగా మారిపోతాయి అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల బాధలను పట్టించుకోని ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపి న్యాయమైన కోర్కెలు అన్నింటిని నెరవేర్చాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తీసివేసి పాత పద్ధతిలోనే నియామకాలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రమేష్, గాంధీ, జక్కుల రమణ పాల్గొన్నారు.

తాజావార్తలు