పారిశ్రామిక హబ్‌గా కర్నూలు అభివృద్ది
జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
పరిశ్రమలతో వేలాది మందికి ఉద్యోగాలు : బాబు
కర్నూలు,మే10(జనం సాక్షి): కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్లు మండలం గుట్టపాడు సవిూపంలో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలు, విూడియాతో ముఖాముఖి నిర్వహించారు. రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవని కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఎన్నో పరిశ్రమలను సీమకు తీసుకొచ్చామని సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని, కర్నూలు జిల్లాకు మరిన్ని సంస్థలు రాబోతున్నాయని తెలిపారు. రూ.3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకానుందని, తద్వారా 5 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని ఆయన అన్నారు. కొత్తపరిశ్రమల వల్ల 80వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని సీఎం వెల్లడించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తర్వాత ఉర్దూ వర్సిటీ, రూసా క్లస్టర్ వర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక ¬దా పేరుతో కొంతమంది దొంగ దీక్షలు చేస్తున్నారని, ప్రత్యేక ¬దా కోసం పోరాటం చేస్తున్న పార్టీ తెలుగుదేశమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో పాల్గొన్న ఆమె ప్రసంగిస్తూ అభివృద్ధిలో రాయలసీమ పరుగులు పెడుతోందన్నారు. మహిళలకు అండగా చంద్రబాబు ఉన్నారని ఆమె అన్నారు.