పార్టీల కతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలి
– అర్హులైన వారందరికీ గృహ లక్ష్మీ పథకం అమలు చేయాలి
– మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని :ధరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హులకు బీసీ లోన్, మైనార్టీ లోన్, గృహ లక్ష్మి పథకం ఇవ్వాలని, ఈ పథకాలను అధికార పార్టీ వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ లక్ష్మీ పథకం ల్యాండ్ ఉన్న వారికి మాత్రమే అందిస్తున్న పథకం.. ..ల్యాండ్ లేని నిరుపేదలకు కూడా ఈ పథకం అమలు చేయాలని శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్నటి తేదీ వరకు మంథని నియోజకవర్గంలోనీ అన్ని మండలంలో కలిపి గృహలక్ష్మి సంబంధించి 25,234 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి అని, మూడు రోజుల్లో మంథని మండలం 3100, మంథని టౌన్ 848, రామగిరి 1448, ముత్తారం 2290, కమాన్ పూర్ 1100, కాటరం 4762,మహ దేవ్ పూర్ 4200,మహ ముత్తారం 3500 , మలహర్ రావు 2698, పలిమెల 1288 మంది ధరఖస్తు చేసుకున్నారని తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే మంథని నియోజకవర్గంలో మొత్తం 25,234 దరఖాస్తులు వచ్చాయన్నారు. మీసేవ కేంద్రాల్లో కుల, ఆదాయ ధృవీకరణ , భూమి కి సంబంధించిన పత్రాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు,మూడు రోజులు మాత్రమే ఇవ్వడం వల్ల చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు వారికి కూడా ప్రభుత్వము అవకాశం ఇవ్వాలి. నియోజకవర్గానికి 3000 ఇండ్లు మాత్రమే మాత్రమే మంజూరు చేస్తానని ప్రభుత్వం చెప్పడం సరికాదు అని, గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 3,500 మంది బిసి బందు కోసం దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బీసీ బందు అమలు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.