పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, మేము రైతుల పక్షమే:- మానల మోహన్

రుద్రూర్ (జనంసాక్షి):
ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీక‌రిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం మేరకు బుధవారం రోజున రుద్రూర్ నాయకులు నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి నాయకుల తో కలిసి బస్టాండ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి, రోడ్డుపైన ధర్నా చేసి , బిఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ మాట్లాడుతూ పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమే అని తెలిపారు. దేశంలో మొదట 70 వేల కోట్ల ఋణమాఫీ చేసిన ఘనత , , ఆదర్శ రైతు వంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ దే అని
తెలిపారు,రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ఎందుకు ఋణమాఫీ చేయలేదని నిలదీశారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజల మరియు రైతుల శ్రేయస్సు ను వదిలి , మొరం మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ద్వారా సహజ వనరులను నాశనము చేస్తున్నది , బిఆర్ ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు అంటూ బహిరంగ సభలో తెలియజేశారు, రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 2 లక్షల రుణమాఫీ , రైతు బంధు 15 వేల రూపాయలు, పింఛన్లు కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి 4 వేల రూపాయలు, సంవత్సరం లోపు, 2 లక్షల ఉద్యోగులు, నిరుద్యోగ బృతి లాంటి ఎన్నో పథకాల గురుంచి వివరించారు

కాసుల బాలరాజు మాట్లాడుతూ: ఎన్నికల భయంతో,రైతులను తప్పు దోవ పట్టించడానికే ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారనీ,బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని. ఈ తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనత ఎవరిదో ప్రజాలకు తెలుసు అని అన్నారు ,ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వంమే, అని మరోసారి గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి బయట పడుతుందనే బిఆర్ ఎస్ నాయకులు ఈ ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి , నియోజకవర్గ నాయకుడు కాసుల బాలరాజు ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందుర్ శేఖర్, జెడ్పీటీసీ అంబర్ సింగ్, ఎలమంచిలి శ్రీనివాస్ లతో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మోస్ర, చందూర్,వర్ని, కోటగిరి, పోతంగాల్ మండలాల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు