పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐ.ఆర్ ప్రకటించాలి

వీణవంక జులై 13( జనం సాక్షి )వీణవంక డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మ్యాకమల్ల శ్రీనివాస్, కనకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదును చేపట్టారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విద్యా వైజ్ఞానిక రాష్ట్ర సభను అక్టోబర్లో నిర్వహిస్తున్నామని దీనికి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత నెల జూన్ తో       పీ ఆర్ సీ గడువు ముగిసినందున ప్రభుత్వం వెంటనే నూతన పీ ఆర్ సీ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎ.నరహరి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రమోషన్లు లేకపోవడం వలన ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ప్రభుత్వం వెంటనే ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు నిర్వహించాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే పూరించాలని ప్రతి పాఠశాలకు స్కావెంజర్లను, అటెండర్లను నియమించాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, బిల్లులు వెంటనే మంజూరు చేసి, సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు ఉమ్మారెడ్డి, లింగయ్య, సంపత్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు