పురుగుల మందు డబ్బాతో రైతు అభ్యర్థన… సర్ది చెప్పిన అదనపు కలెక్టర్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. 24. (జనంసాక్షి). అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయిన అన్నదాత పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి హాజరయ్యారు. సమస్యను పరిష్కరించాలని వేడుకోవడంతో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సర్ది చెప్పడంతో శాంతించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ముస్తాబాద్ మండలం చికోడు గ్రామానికి చెందిన రైతు కరెడ్ల రాజిరెడ్డి వారసత్వంగా వచ్చిన భూమి 37 గుంటలు గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. క్రాప్ లోన్ సైతం తీసుకున్నాడు. ఇటీవల లోన్ పూర్తిచేసి తన భూమికి సంబంధించిన పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంలో అధికారులు ధరణిలో మీ పేరు చూపించడం లేదంటూ తెలపడంతో నివ్వెర పోయిన రైతు రాజరెడ్డి అధికారుల చుట్టూ ధరణిలో నమోదు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయాడు. చివరకు దరఖాస్తు పురుగుల మధు డబ్బాతో ప్రజావాణికి హాజరయ్యారు. రాజరెడ్డి పరిస్థితి చూసి చలించిన అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాజరెడ్డి తన గోడు తీరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది అంటూ అధికారులను వేడుకున్నారు.