పూర్తి జట్టును ప్రకటించింన కిరాక్ హైదరాబాద్

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 12 ప్రో పంజా లీగ్‌ లో బరిలో నిలిచిన హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కిరాక్ హైదరాబాద్ ప్రారంభ సీజన్‌ కోసం తమ పూర్తి జట్టును ప్రకటించింది.
ప్రో పంజా లీగ్ ఆరంభ సీజన్ జూలై 28 నుంచి ఆగస్టు 13,వరక ఢిల్లీలోని ఐజిఐ స్టేడియంలో జరుగుతుంది. సోనీ టెన్1 ఎస్డీ, సోనీ టెన్1 హెచ్దీ లో ప్రసారం అవుతుంది. న్యూఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌లో జరిగిన ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో 180 మంది ఆటగాళ్లను ఆరు జట్లు ఎంచుకున్నాయి. హైదరాబాద్ జట్టు10 విభాగాల్లో మొత్తం 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్విన్ దాబాస్ మాట్లాడుతూ తొలిసీజన్ ప్రారంభానికి ముందు ప్రో పంజా లీగ్ ఇప్పటికే సృష్టించిన సందడిని చూసి మేము సంతోషిస్తున్నాము. లీగ్ కు మద్దతు ఇచ్చినందుకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా చారు శర్మ తన బిజీ షెడ్యూల్ నుంచి మాకు పూర్తి సమయాన్ని వెచ్చించి, ప్లేయర్ డ్రాఫ్ట్‌లో మాకు సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.మా జట్లు అన్నీ ఇప్పుడు ఖరారయ్యాయి.బరిలోకి దిగేందుకు మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు” అని చెప్పారు.ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకురాలు ప్రీతీ ఝాంగియాని మాట్లాడుతూ మా అథ్లెట్లను అతిపెద్ద వేదికపై ఉంచినందుకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను పొందడానికి సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇప్పుడు జూలై 28 నుంచి లక్షలాది మంది ప్రజలు ఈ అథ్లెట్ల సత్తాను చూడగలరు అని పేర్కొన్నారు.
లీగ్ మొదటి సీజన్‌కు ముందు కిరాక్ హైదరాబాద్ యజమాని గౌతమ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు.ఈలీగ్ ను ముందుకు తీసుకెళ్లడానికి మేము నిజంగా సంతోషిస్తున్నాము.ఈ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రీతి ఝాంగియాని,పర్విన్ దాబాస్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. టోర్నమెంట్‌కు ముందు ఇతర జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మంచి సీజన్ ముందుదిఅన్ని ఉత్తేజకరమైన మ్యాచ్‌లను ఆస్వాదిద్దాము.ఆటగాళ్ల ఎంపిక విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాము.లీగ్లో ముందుకెళ్తున్న కొద్దీ మేమునేర్చుకుంటున్నామ.60 కిలోలు,70 కిలోలు, 90 కిలోల విభాగంలో అత్యుత్తమ ఆటగాళ్ల ను తీసుకున్నాము.మాకు మంచి బ్యాలెన్స్ తోకూడినటీమ్ ఉందనినేను ఖచ్చితంగా అనుకుంటున్నా. మా ఆటగాళ్ళు తమ ఉత్తమ ప్రదర్శన ఇస్తారు అని చెప్పుకొచ్చారు.హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ ఫైజాన్ అలీని హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకుంది. తన సొంత రాష్ట్రానికి ఎంపికై, తన జట్టుకు ప్రాతినిథ్యం వహించడంపై అతను సంతోషం వ్యక్తం చేశాడు. “ప్రో పంజా లీగ్ మొదటి సీజన్‌లో నేను నా స్వంత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. నన్ను తమ జట్టులోకి తీసుకున్నందుకు గౌతమ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లీగ్ దేశంలో నాలాంటి అనేక మంది ఆర్మ్ రెజ్లర్‌లకు తమ సత్తాను అవకాశాలను అందిస్తుందని బలంగా నమ్ముతున్నా. లీగ్ లో మెరుగైన, ఉత్తేజకరమైన మ్యాచ్‌లుజరుగుతాయి.ఈ లీగ్ ఆర్మ్-రెజ్లింగ్ కమ్యూనిటీకి పునాదిని అందిస్తుంది. ప్రపంచ స్థాయి వేదికపై మా నైపుణ్యాలు, టెక్నిక్స్ ను ప్రదర్శించడానికి ఈ అద్భుతమైన అవకాశం అందిస్తున్న పర్విన్ దాబాస్‌,ప్రీతీ ఝాంగియాని ధవాదాలు తెలియజేశారు.

తాజావార్తలు