పెట్రోల్‌, డీజల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధగా

– రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు
విజయనగరం, మే8(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ డీజిల్‌ పై పన్నులు పెంచి,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వాటి ధరలు ఆకాశానికి ఎత్తి ప్రజలను ధగా చేస్తున్నారని సిపియం జిల్లా కార్యదర్శి ఆర్‌ శ్రీరామూర్తి అన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ పెంపుకు వ్యతిరేకంగా సిపియం కేంధ్ర కమిటి పులుపు మేరకు మంగళవారం స్థానిక ఆర్‌టిసి కూడలి, పాతబస్సుస్టాండ్‌ వద్ద గంటపాటు మండుటెండను లెక్కచేయకుండా ధర్నా, నిరసనల కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెట్రోల్‌ డీజల్‌ ధరలపెంపుకు నిరసనలో దారిపొడువునా వాహనదారులు వాహనాలను నిలిపి మద్దతుపలికిన వారందరికి ధన్యవదాలుతెలిపారు. ఈకార్యక్రమంలో సిపియం జిల్లా కమిటి,పట్టణ కమిటిల సభ్యులు జి.వెంకటరమణ,పాకల సన్యాసిరావు,తోపుడుబల్లు యునియన్‌ సెక్రటరీ ఊనం ప్రభకరరావు,మోటార్‌ మెకానిక్‌ యూనియన్‌ నాయకలు వీరరాజు,ఆటోకార్మికల యునియన్‌ నాయకులు చంటి,రాజారావు,మధు,ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా కార్యధర్శి రాజశేఖ,సూరిబాబు తదితరలు పాల్గొన్నారు.
విజయవాడలో సీపీఎం నేతల అరెస్ట్‌
పెట్రోల్‌,డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరు రోడ్డులోని అప్సర సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ..కేంద్రం చీటికి మాటికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డీ విరుస్తుందని మండిపడ్డారు. పెట్రోల్‌ ధర రూ.31 ఉంటే కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు కలిసి యాభై రూపాయలను పన్ను రూపంలో వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని, లేనట్లయితే ఆందోళనలు కొనసాగిస్తామని మధు పేర్కొన్నారు. అరెస్ట్‌ అయిన నేతల్లో మధు, బాబూరావు, కాశీనాధ్‌, తదితర నాయకులు ఉన్నారు.
—————————

తాజావార్తలు