పెను తుపానుగా వార్ధా తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను పెను తుపానుగా మారిందని, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 550కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పెను తుపాను ప్రభావంతో గంటకు 45-50కి .మీ వేగంతో తీరం వెంబడి ఈశాన్య దిశగా బలమైన గాలులు వీసున్నాయి. సోమవారం మధ్యాహ్నానికి ఒంగోలు-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని, నేటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోను సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.