పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమే

7wm2avc2ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాని వల్ల వచ్చే నిధులక న్నా అధికంగా ఇస్తామని చెప్పడం పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. చంద్రబాబు తనకున్న పరిపాలనా దక్షత, విజ్ఞత, లౌక్యంలను రంగరించి కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఆశించామన్నారు. మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు పరిస్థితి చూస్తే గత్యంతరం లేక తోకముడిచి వెనక్కి వచ్చినట్లుగా ఉందన్నారు. కేంద్రానికి తలొగ్గాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏమాత్రం ఇరుక్కోరని ఉండవల్లి తెలిపారు. అసెంబ్లీ వ్యతిరేకించిన తీర్మానాన్నే పక్కన పెట్టి రాష్ర్టాన్ని విభజించగలిగినప్పుడు హోదాపై 14వ ఆర్ధికసంఘం చెప్పిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇప్పించలేకపోతున్నారో.. వెంకయ్యనాయుడే చెప్పాలని, ఆ రహస్యం ఆయనకే తెలుసన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, బిహార్‌కు నీతిఆయోగ్‌ రోడ్‌మ్యాప్‌ లేకుండానే నిధులు ఇచ్చిన మోదీ.. ఏపీకి మాత్రం మెలికలు పెడుతున్నారని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకుని తిరిగొస్తారనుకుంటే.. తలవంపులతో తలదించుకొని వచ్చారని ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదని అన్నారు

తాజావార్తలు