పేదలకు నాణ్యమైన వైద్యం: కామినేని

అమరావతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని తెలిపారు. మాతాశిశు మరణాల నివారణకు గట్టి చర్యలు చేపట్టామన్నారు. గర్భిణులకు సకాలంలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, సురక్షిత ప్రసవాలు జరిగేలా అవసరమైన వసతులు కల్పించామని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు విధానం ప్రవేశపెట్టి వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు కలిసి పీహెచ్‌సీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపరచి గ్రావిూణ పాంత ప్రజలకు మంచి వైద్య సేవలందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.

తాజావార్తలు