పేదింటి ఆడపడుచులకు అండగా కేసీఆర్ -ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
టేకులపల్లి, జూలై 15( జనం సాక్షి ): కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలిచారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం టేకులపల్లి మండలంలోని సింగరేణి హైటెక్ కాలనీలో సింగరేణి క్లబ్ నందు 65 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, 4 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా తహసిల్దార్ వీరభద్రం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో బృహత్తరమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ అని అన్నారు. ఉచితంగా 24 గంటలు వ్యవసాయానికి అందిస్తూ రైతులను ఆదుకుంటున్నారని, జీవనాధారం గా పోడు వ్యవసాయని నమ్ముకున్న గిరిజన రైతులకు పట్టాలు అందించడం జరిగిందన్నారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతుబంధు, ఏదైనా కారణం చేత రైతు మృతి చెందినట్లయితే రైతు బీమా తో ఐదు లక్షల రూపాయలు అందించి కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో వచ్చిన వెంటనే పేద ప్రజల కష్టాలు తెలిసిన పెద్ద అన్న వలె మొదలుగా 51,000/- వేలు , తర్వాత 75,116/-వేల రూపాయలు ప్రస్తుతం 100116/- లక్ష రూపాయలుగా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేయడం జరుగుతుంది అని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే కొంతమందికి అది నచ్చడం లేదని అన్నారు.
కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సంక