పేలుడు పదార్థాలను తరలిస్తే కఠిన చర్యలు.. అప్రమత్తమైన రైళ్ల శాఖ
హైదరాబాద్: రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలతో ఆ శాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు పదార్థాలను తరలించేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిచ్చింది. ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్, పెట్రోల్, ఆసిడ్, డీజిల్, బాణసంచా, గన్‌పౌడర్ తదితర పదార్థాలు రైళ్లలో నిషేధమని వీటిని తరలిస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని అధికారులు తెలిపారు. రైలులో పేలుడు పదార్థాలు గుర్తిస్తే సంబందిత సమాచారాన్ని వెంటనే 8121281212 నెంబర్‌కు ఫోన్ ద్వారా లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేయాలని అదికారులు కోరారు.