పొగాకు రైతులకు ఎరువుల సరఫరా నిలిపివేత

ఒంగోలు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఈ ఏడాది నుంచి పొగాకు రైతులకు ఎరువుల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పొగాకు బోర్డు రీజియన్‌ మేనేజరు ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఒంగోలులోని రెండో వేలం కేంద్రంలో శుక్రవారం పొగాకు రైతుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోర్డు ద్వారా ఎరువుల విధానాన్ని నిలిపివేసినట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి పొగాకు బేరెండ్ల లైసెన్సు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరుగుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలో మిగిలిపోయిన అనధికారిక పంట ఉత్పత్తి నిల్వలను కొనుగోలు చేయటం జరుగుతుందని సూచించారు. సమావేశంలో వేలం కేంద్రం అధికారులు చంద్రశేఖర్‌, అప్పారావు పాల్గొన్నారు.

తాజావార్తలు