పొడిచేడు లో పౌర హక్కుల దినోత్సవం

మోత్కూరు జూలై 31 జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మోత్కూర్ మండలంలోని పొడిచెడు గ్రామంలోని ఎస్సి కమ్యూనిటిహాల్ దగ్గర ఆర్ఐ దాసరి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ మాట్లాడుతూ గుడిలో బడిలో తదితర సందర్భంలల్లో సమానత్వం చూపకపోయినట్లయితే ఇంకే కారణాలతోనైనా కుల వివక్ష చూపి దూషించిన దాడులు చేసిన వెంటనే అట్టి వ్యక్తులపై పోలీస్ లకు పిర్యాదు చెయ్యాలని అట్టి వ్యక్తులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అవుతాయి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పిర్యాదు దారులకు జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అండగా ఉంటుంది అని ఇతర ప్రయోజనాలకోసం మాత్రం ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులను వాడొద్దని వాడినట్లు అయితే కేసులు ఫాల్స్ అయ్యి పిర్యాదు దారులు ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలియచేస్తూ ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పలు అంశాలు తెలియచేశారు. సర్పంచ్ పేలపూడి మధు మాట్లాడుతూ దళిత కాలనీ అభివృద్ధి కి నిరంతరం పాటుపడితున్నామని మా గ్రామ దళితులు అన్ని రంగాలల్లో చైతన్య వంతులుగా కావడం కోసం మా వంతు తోడ్పాటు అందచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి దీటీ సంధ్యరాణి సందీప్, ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ డబ్ల్యుఒ ప్రసన్న, సింగిల్ విండో డైరెక్టర్ జిట్ట లక్షయ్య, పంచాయితీ సెక్రటరీ చిన్నం కిరణ్, , హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు