పోడుభూమి లేకున్నా అధికార పార్టీ నాయకులకు పాస్ పుస్తకాలు

 

 

 

 

* పట్టా బుక్కు పై ముఖ్యమంత్రి ఫోటో రాజ్యాంగ విరుద్ధం
* పోడు భూమి కలిగిన రైతులందరికి పోడు పట్టాలు ఇవ్వాలి
* ఐ టి డి ఏ అధికారులకు చీమల, లక్కినేని ఆధ్వర్యంలో రైతులతో వినతి పత్రం

టేకులపల్లి, జూలై 10( జనం సాక్షి): పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులందరికి పట్టాలు ఇవ్వాలని కోరుతూ బద్దు తండా గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్రాయి గూడెం, బొమ్మల చిలక గ్రామపంచాయతీలలోని గిరిజన రైతులతో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావుల ఆధ్వర్యంలో సోమవారం ఐ టి డి ఏ భద్రాచలంలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భముగా ఐటిడిఎ అధికారులకు దృష్టికి
అధికార పార్టీ నాయకులుకు పోడు భూమి లేకపోయిన పాసు పుస్తకాల మంజూరని ఆరోపిస్తూ వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోడు భూములు సాగు చేసుకున్న గిరిజన రైతులకు పట్టా హక్కులు కల్పించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, అయినా పోడు హక్కు పట్టాలపై ఎవరి ఫోటోలు లేవని, ప్రస్తుతం పంచుతున్న పట్టా బుక్కులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో ముద్రించడం రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బధ్ధు తండా ఏంపిటిసి సభ్యులు ఊకే రామక్రిష్ణ, ఆదీవాసి నాయకులు వాసం రామక్రిష్ణ,ఇల్లందు నియోజకవర్గ సోషల్ మిడియా కోఆర్డినెటర్ నాగేంద్ర,శీవ నాయక్,చనప రామారావు,ఊకే సురేష్,నూనవత్ బాల,చింత రవి,ఊకే బుచ్చయ్య,ఊకే నాగేశ్వరావు, ఊకే గోపాల్,ఊకే మల్లయ్య,పెనక సత్యనారయణ, జెరా సర

తాజావార్తలు