పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

 

సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన ర్యాలీ

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 14 : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దరాజుపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి సోమవారం సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం పెద్దరాజుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ హాజరై మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి నుండి పెదరాజుపేట వరకు ఒక కిలోమీటర్ మెర ఉన్న మట్టి రోడ్డు మీదుగా విద్యార్థులు, ప్రజలు ప్రయాణికులు, చేర్యాల, కొండపోచమ్మ, హైదరాబాద్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు నిత్యం వందలాదిమంది ప్రయాణం చేస్తుంటారని, వర్షం పడితే ఈ మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా మారి గుంతలు ఏర్పడడంతో బస్సులు, వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు వరి నాట్లతో నిరసన తెలిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలతో విన్నపాలు చేసినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు, రోడ్డు రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ గ్రామాల ప్రజలను ఏకం చేసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బంగారు ప్రేమ్ కుమార్, సీపీఐ నాయకులు గర్నపల్లి కనకయ్య, మరికొండ నరేష్, శెట్టి రాజు, పాల కమలాకర్, గుడిసె నర్సయ్య, మామిండ్ల మహేష్, కత్తుల బాపురెడ్డి, గర్నపల్లి సురేష్, గర్నపల్లి రాజు, మెడమైన మహేష్, మెడమైన రాకేష్, చాప హరీష్, పోరెడ్డి మల్లయ్య, గుడిసె కనకయ్య,బొకూరి నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు