పోలవరంకు రూ.2,991 కోట్లు
పోలవరం ప్రాజెక్టు నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.2,991 కోట్లకు ఆమోదం తెలుపుతూ దస్త్రంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంతకం చేశారు. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖకు ఆర్థికశాఖ సమాచారం పంపింది. పోలవరం నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా తామే భరిస్తామని, నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 నాటికి పోలవరం తొలిదశ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి విడుదల చేసినట్లు ప్రభుత్వానికి సమాచారం అందిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.