పోలవరంపై స్పష్టత ఇవ్వాలి: మధు

విజయవాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార టిడిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలిన అన్నారు. కేంద్రం ఇచ్చిన హావిూల అమలుకు ప్రజల మద్దతుతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, అందుకు సీపీఎం కూడా మద్దతు ఇస్తుందని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే బహిరంగ ధర్నాలు, ఆందోళనబాట చేపడతామని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ కేంద్రం రాసిన లేఖపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతోంది. ఇందుకు చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తుంటే.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతున్నాయి. మరోవైపు ఎవరు ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టుపై వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోవలరం నిర్మాణంతోపాటు రాష్టాభ్రివృద్ధికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న విషయాన్ని ఈ సందర్బంగా మధు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారం చేజిక్కించుకున్న తర్వాత హావిూల విస్మరణ, అమలుకు నోచుకోని పథకాలతో ప్రజలను మభ్యపెట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వం

వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విభజన చట్టంలోని హావిూలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్టాన్రికి 11 విద్యాసంస్థలను కేటాయించినా నిధుల మంజూరులో తాత్సారం చేస్తోందని, కడపలో ఉక్కు పరిశ్రమ వంటి హావిూలన్నీ విస్మరించిందని ఆరోపించారు. జనవరి 4న భీమవరంలో రుణమాఫీ అమలు తీరుపై ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు వివరించారు.

తాజావార్తలు