పోలవరం ఆపేయమంటే ఆపేస్తాం
కేంద్రమే చేపడతామంటే అభ్యంతరం లేదు
నీతి ఆయోగ్ ఆదేశిస్తేనే పనులు చేపట్టాం
గడ్కరీతో అన్ని విషయాలు మాట్లాడుతా
విభజన సమస్యలు అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి
అసెంబ్లీలో, విూడియా సమావేవంలో బాబు వెల్లడి
అమరావతి,నవంబర్30(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం విూడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలల పాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తే సరే…లేకుంటే మన కష్టమే మిగులుతుందని విూడియాకు ఆయన వివరించారు. విభజన హావిూల సాధనలో రాజకీయం చేయనని చంద్రబాబు తేల్చిచెప్పారు. ‘నేను ఆశావాదిని….నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. ‘పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేవిూ కావాలని తీసుకోలేదు’ అని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ
పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలన్న కేంద్రం లేఖపై చంద్రబాబు స్పందించారు. గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్నించా. ఆయన లండన్‌లో ఉన్నారు, రాగానే మాట్లాడతానని చెప్పారు. పోలవరం కోసం ఇంకా 60వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. 98వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. భూ సేకరణ అంచనాల వ్యయం 32వేల కోట్ల వరకు పెరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. పోలవరం పనులకు ఇంకా రూ.42వేల కోట్లు అవసరం. కేంద్రం తీసుకొచ్చిన కొత్తచట్టం వల్ల భూసేకరణ అంచనాలు పెరిగాయి. సకాలంలో పోలవరం పూర్తికావాలన్నది మా లక్ష్యం. ప్రత్యేక ¬దాపై నేను త్యాగం చేయలేదు, విజ్ఞత ప్రదర్శించా. ప్రత్యేక ¬దాలో ఉన్నవన్నీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తామని ఆర్థికమంత్రి చెబితే అందుకు ఒప్పుకున్నా. విభజన చట్టంలోని హావిూలు, కేంద్ర సహకారంపై మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు భూ సవిూకరణ ద్వారా 33వేల ఎకరాలు ఇచ్చారు. రాజధాని రైతులకు కేంద్రం కేపిటల్ గెయిన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 స్థానాలకు, తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు’ అని చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.2,500 కోట్లు మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, జరిగిన అభివృద్ధిపై వివరించారు. 13వ షెడ్యూల్‌లోని 9 సంస్థలు వచ్చాయి, మరికొన్ని రావాల్సి ఉందని తెలిపారు. నిన్న నీట్‌ను ప్రారంభించాం.. ఎస్‌ఆర్‌ఎంకు భూములు కేటాయించామని వివరించారు. సెంట్రల్, గిరిజన వర్సిటీలు రావాల్సి ఉన్నాయి… భూమి అడిగితే ఒక్క నిమిషం ఆలోచించకుండా కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.