పోలవరం ఘనత బిజెపిదే

విజయవాడ,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలనే యోచనతోనే తెలంగాణాలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం జరిగిందని బిజెపి నేతలు అన్నారు. ఇందులో వెంకయ్యనాయుడు కృషి మరువ లేనిదన్నారు. ఇలా మొదటి నుంచి భాజపా ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసిందన్నారు. అలాగే రాష్టాన్రికి నిరంతర విద్యుత్తును అందించి పారిశ్రామిక రంగం కుంటుపడకుండా చేసిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఆంధ్రప్రదేశ్‌ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక ¬దాతో రాష్టాన్రికి పరోక్షంగా మాత్రమే మేలు జరుగుతుందని.. ప్యాకేజీ వల్ల ప్రత్యక్షంగా మేలు జరగటంతో పాటు శరవేగంగా అభివృద్ధి పనులు చేపట్టే వీలుంటుందన్నారు. గతంలో ప్రత్యేక ¬దా పొందిన 11 రాష్టాల్రు అభివృద్ధి చెందలేదన్న విషయాన్ని భాజపా గమనించదన్నారు. సీపీఎం, సీపీఐలు ప్రత్యేక ¬దాకోసం ఆందోళనలు చేసి కాంగ్రెస్‌పార్టీకి బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకుని శాసనమండలిలో దానికి మద్దతు తెలిపారన్నారు.

తాజావార్తలు