పోలవరం నిర్వాసితులపై ప్రేమ చూపండి: మధు

కాకినాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): పోలవరంలో ఎమ్మెల్యేల పర్యటనతో ప్రయోజనం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో చిత్తశుద్దితో కృషి చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలన్నారు. శుక్రవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుకు నిధుల కోసం కేందప్రభుత్వంతో పోరాడాలన్నారు. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్యను గాలికి వదిలేశారన్నారు. విభజన చట్టంలో హావిూలను మరచిపోయారని ఆయన విమర్శించారు.ఈనెల20న వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మధు తెలిపారు. దివీస్‌ పరిశ్రమ వల్ల నీరు కలుషితమై మత్స్య సంపద కనుమరుగై వేలాది మంది మత్స్యకార కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరిగిన నిరుద్యోగంతో ఎంతో మంది వలసలు పోతున్నారన్నారు. ఉపాధి కూలీలకు పనులు లేక పస్తులుంటున్నారన్నారు. దోపిడీ పాలన ఉన్నచోటే పోరాటాలు వెలుస్తాయన్నారు.

 

తాజావార్తలు