పోలవరం పనులను వేగవంతం చేయాలి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

– పోలవరం ప్రాజెక్టుపై సవిూక్షించిన సీఎం

అమరావతి, జ‌నం సాక్షి ) : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సవిూక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02 శాతం పూర్తి అయిందన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు 89.44 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 59.16 శాతం పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌ ఎర్త్‌వర్క్‌ పనులు 72.30 శాతం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు 16.40 శాతం, డయాఫ్రమ్‌ వాల్‌ 85.10 శాతం, జెట్‌గ్రౌటింగ్‌ పనులు 64.90 శాతం, రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు 60 శాతం పూర్తి అయ్యాయని చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు లక్ష క్యూబిక్‌ విూటర్లు దాటిందని చంద్రబాబు చెప్పారు. ఈ నెలలో 1,15,658 క్యూబిక్‌ విూటర్ల వరకు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు జరిగాయని, మే, జూన్‌ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్‌, కాంక్రీట్‌ పనులు చేపట్టాలని సీఎం అధికారులను

ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు.

తాజావార్తలు