పోలీసుల అదుపులో ఆర్కే

555551112222

– వెంటనే కోర్టులో హాజరు పరచాలి

– వరవరరావు

విశాఖపట్టణం,అక్టోబర్‌ 27(జనంసాక్షి): మావోయిస్టు అగ్రనాయకులంతా పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారని వరవరరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.  ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో పెద్దసంఖ్యలో మావోయిస్టలు మరణించిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీకి అందుబాటులోలేరని, దీంతో ఆర్కేను ఏపీ ప్రభుత్వమే అదుపులోకి తీసుకుందని పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజా పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని, లేదంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్కేకు ఏమైనా జరిగిగే ప్రభుత్వానితే బాధ్యత అని హెచ్చరించారు. ఆయన పోలీస్‌ అదుపులనే ఉన్నారని వరవరరావు ఆరోపించారు. వారిని హింసించి చంపేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఎదురుకాల్పుల్లో గాయపడి పోలీసుల అదుపులో ఉన్నారని ఆయన భార్య శిరీష అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందిన తమ కుమారుడు మున్నా మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆమె మల్కాన్‌గిరి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. మున్నా ఎంతో తెలివైన విద్యార్థిగాఉండేవాడని… తనయుడిని తలుచుకుని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) పోలీసులు అదుపులో ఉన్నారని పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజా పార్టీల నేతలు చేసిన ఆరోపణలపై ఏపీ పోలీస్‌ వర్గాలు స్పందించాయి. ఆర్కే తమ అదుపులో లేరని తెలిపాయి. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీస్‌ వర్గాలు చెప్పాయి. ఘటనాస్థలిలో 50 కిట్‌బ్యాగులు దొరికాయని, గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తప్పించుకున్న వారిలో ఎవరెవరు ఉన్నారన్నది తెలియదన్నారు. లొంగిపోయిన వారికి అన్ని విధాలా సహకారం ఇస్తామని డిజిపి ఇప్పటికే వెల్లడించారు.

తాజావార్తలు