పౌరసరఫరాల ద్వారా సక్రమ పంపిణీ
అమరావతి,సెప్టెంబర్4(జనంసాక్షి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరుకుల పంపిణఫీ సక్రమంగా సాగుతోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం బియ్యం కూడా సక్రమంగా అందలేదని మంత్రి ఆరోపించారు. అలాంటి వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాకు రెండు పెట్రోల్ బంకులు ప్రారంభించాలన్న ప్రతిపాదన మేరకు గతంలో 13 జిల్లాల్లో 23 చోట్ల స్థలాల పరిశీలన జరిగిందని చెప్పారు. అర్హులైనవారందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు పంపిణీచేస్తామని వెల్లడించారు. రేషన్ దుకాణానికి రాలేని వారికోసం విూ రేషన్-విూ ఇంటికి పథకం ద్వారా ఇంటి వద్దే రేషన్ సరకులు అందిస్తున్నట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ అంటే అవినీతి అనే భావనను ఇప్పుడు పోగొట్టామని పేర్కొన్నారు. ఈపాస్ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచామన్నారు.