ప్రజల గుండెల్లో వైఎస్‌ చిరస్థాయిగా నిలిచారు

రాష్ట్రంలో ఏ ఒక్క కుఉటంబం సంతోషంగా లేదు
తనను రాజకీయాల్లోంచి తప్పించే కుట్ర
ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటా
ఇడుపులపాయ బహిరంగ సభలో జగన్‌
కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబం కూడా
సంతోషంగా లేదని, ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు తాను పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకుముందుకుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. జగన్‌కు మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వంపై జగన్‌ విమర్శలు గుప్పించారు.  8 ఏళ్లుగా తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జగన్‌  ధన్యవాదాలు తెలిపారు.  చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, ఈ నాలుగేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో రైతులు, అక్కాచెల్లెమ్మలు మోసపోయారని, విద్యార్థులు, నిరుద్యోగులు దగాపడ్డారని, అందుకే  అందరిలోనూ చంద్రబాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు అనే మాట వినిపిస్తోందని  జగన్‌ వ్యాఖ్యానించారు. తన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఎంతటి దూరాన్నైనా లెక్కచేయకుండా వచ్చి ఆప్యాయత, అనురాగాలను చూపుతున్న అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వలు, తాతలు, అందరి ప్రేమాభిమానాలకు, చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజు ఇడుపులపాయలో మహానేత రాజశేఖర్‌రెడ్డి మన అందరి కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఆ దివంగత నేతకు మరణం లేదు’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక కారణంతో, జగన్‌ను రాజకీయాల నుంచి తప్పించాలనే ఒకే కారణంతో అధికారంలో ఉన్న నేతలు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు వయస్సులో నా వయస్సు సగం కూడా ఉండదు. చంద్రబాబు కొడుకు వయస్సులో నేను ఉంటానేమో. కానీ చంద్రబాబు రాక్షసత్వం చూసి.. నన్ను రాజకీయల్లో తప్పించాలన్న చంద్రబాబు తీరు చూసి బాధ కలుగుతోంది’ అని అన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ అందించిన ఇంతపెద్ద కుటుంబాన్ని చూసినప్పుడు ఆ బాధ నుంచి ఊరట కలుగుతుందన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వంలోని పెద్దలతో పోరాటం చేస్తున్నానని, రాజకీయాలలో చేయని పోరాటం లేదని గుర్తుచేసుకున్నారు. తాను నడిచిన  ప్రతి అడుగు లోనూ ప్రజలందరూ అండగా నిలబడ్డారు కాబట్టే చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తనకు తోడుగా నిలిచిన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని మరిచిపోనని, వారి రుణాన్ని తీర్చుకో లేనని అన్నారు.  ప్రజల సలహాలు తీసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు జగన్‌ వివరించారు. తనను రాజకీయాల నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతున్నా ప్రజల అభిమానాన్ని చూసి ఎప్పటి కప్పుడు
నిలబడగలుగుతున్నా. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోంది. అందుకే ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు మూడువేల కిలోవిూటర్ల పాదయాత్ర చేపట్టా. పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని మేనిఫెస్టో తయారు చేస్తాం అని అన్నారు. చంద్రబాబులా నాకు మోసం చేయడం రాదు. ప్రజలకు చేయగలిగిన, నెరవేర్చగలిగిన హావిూలు మాత్రమే మేనిఫెస్టోలో రూపొందిస్తాం. రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్ర అప్పు రూ.96వేల కోట్లుంటే.. ఇప్పుడు రూ.2.05లక్షల కోట్లకు చేరింది. మూడున్నరేళ్లలోనే 1.09వేల కోట్ల మేర అప్పు పెరిగింది’ అని జగన్‌ అన్నారు. రైతులకు అప్పులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను ఆదేశిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు గడ్డుకాలం మొదలైంది. నాలుగేళ్లుగా ఒక్క పంటకూ మద్దతు ధర రావడం లేదు. పంటల ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పిన చంద్రబాబు ఆ హావిూని నెరవేర్చ లేదు. ఒక్క రైతుకూ రుణమాఫీ పూర్తిగా అందలేదు. ప్రత్యేక ¬దా తీసుకురావడంతో చంద్రబాబు విఫలమయ్యారు. ¬దా వస్తే పరిశ్రమలు  వెతుక్కుంటూ వస్తాయి. ఆయన ఏ సినిమా చూస్తే అందులోని సెట్టింగులు చూపించి అవే అమరావతి భవనాలని చెబుతుంటారు. ఒకసారి సింగపూర్‌లా, మరోసారి జపాన్‌లా రాజధాని కడతానని అసత్యాలు చెబుతున్నారు. ఇన్నాళ్లలో అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్పించి శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుకైనా వేశారా? అని జగన్‌ ప్రశ్నించారు.

తాజావార్తలు