ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, జులై 10 (జనం సాక్షి);

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 80 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో ఆసరా పెన్షన్ కు సంబంధించి 16 ధరఖాస్తులు , భూ సమస్యలు , భూ సర్వే , ఎలక్ట్రిసిటీ , రెవెన్యూ , వివిధ శాఖలకు సంబంధించి 64 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని ధరఖాస్తులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన ధరఖాస్తులను పరిశీలించారు . సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరి ధరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలోజిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, ఆర్డిఓ రాములు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు