ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి -జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7(జనం సాక్షి);

ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 102 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో ఆసరా పెన్షన్ కు సంబంధించి 6 ధరఖాస్తులు, భూ సర్వే 7 దరఖాస్తులు ,భూ సమస్యలు ,ఇతర సమస్యల కు సంబంధించి 89 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్ ఇతర సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని ధరఖాస్తులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన ధరఖాస్తులను పరిశీలించారు . సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరి ధరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ డి ఓ చంద్రకళ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు